అప్పర్ భద్ర ప్రాజెక్టుపై ఏపీ దాఖలు చేసిన పిటిషన్ వాయిదా

రిపోర్టర్: సురేష్ స్థలం: దిల్లీ

కృష్ణా ట్రైబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఎనిమిది వారాలకు వాయిదా వేసింది. జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇరుపక్షాలు సంయుక్తంగా రూపొందించిన ఏడు అంశాల ఆధారంగా తదుపరి విచారణ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం కూడా మరో పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉందని ధర్మాసనం పేర్కొంది.