అల్లూరు మండలం ఇందూపూర్ ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థి నామినేషన్ దాఖలు

రిపోర్టర్: సురేష్ స్థలం: నెల్లూరు

కావలి నియోజకవర్గంలోని అల్లూరు మండలం ఇందూపూర్ ఎంపీటీసీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా కోడూరు యమున గురువారం తన నామినేషన్ పత్రాలను అధికారికంగా దాఖలు చేశారు. కావలి జనసేన పార్టీ సమన్వయకర్త మన్నెమాల సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మరియు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర సహకారంతో ఈ నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు. కూటమి నాయకుల సమన్వయంతో అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.