సినిమా ప్రియులకు తీపి కబురు: నవంబర్ 13న గీతాంజలి రీరిలీజ్

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

తెలుగు సినీ చరిత్రలో క్లాసిక్ ప్రేమకావ్యంగా నిలిచిన నాగార్జున గీతాంజలి చిత్రం నవంబర్ పదమూడో తేదీన ప్రపంచవ్యాప్తంగా ఫోర్ కే వెర్షన్లో గ్రాండ్గా రీరిలీజ్ కానున్నట్లు నిర్మాత బూర్లె శివప్రసాద్ వెల్లడించారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేటి యువతను కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందని, సరికొత్త అనుభూతిని పంచుతుందని శ్రీపద్మిని సినిమాస్ ప్రతినిధులు తెలిపారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక విలువలతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.