వైద్యసేవల్లో కీలక మార్పులు: ఐసీయూ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఉత్తర్వులు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అమరావతి
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నిర్వహణ మార్గదర్శకాలను విధిగా అమలు చేయాలని వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అత్యవసర వైద్య సేవల మెరుగుదల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నిపుణులైన వైద్యులు, సిబ్బంది నియామకం అలాగే ఆధునీకీకరణ పనులకు నిర్దిష్టమైన కాలపరిమితిని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.