పరిశ్రమలకు తీపి కబురు: రూ.1,500 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల
రిపోర్టర్: హరి
స్థలం: అమరావతి
ఏపీలో పరిశ్రమలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ నెలాఖరులోగా అర్హులైన 8 వేల ఎంఎస్ఎంఈలు, 700కు పైగా పెద్ద పరిశ్రమలకు రూ.1,500 కోట్ల ప్రోత్సాహకాలను జమ చేయనుంది. గత ప్రభుత్వం పెట్టిన రూ.5 వేల కోట్ల బకాయిలను దశలవారీగా చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నవంబరులో విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో పారిశ్రామికవేత్తల్లో భరోసా కల్పించేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.