వెంకటాచలంలో యోగి ఆదిత్యనాథ్కు ఘన స్వాగతం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వెంకటాచలం
నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని అక్షర విద్యాలయానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.
ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల సమక్షంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి యోగి ఆదిత్యనాథ్ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, స్థానిక నాయకులు పాల్గొని ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికారు.