షాకింగ్ ఘటన: ఇండోనేషియాలో మహిళను సజీవంగా మింగిన భారీ కొండచిలువ

రిపోర్టర్: అశోక్ స్థలం: Indonesia

ఇండోనేషియాలోని జంబి ప్రావిన్స్లో రబ్బరు సేకరణకు వెళ్లిన జాహ్రా అనే మహిళను ఐదు మీటర్ల పొడవున్న భారీ కొండచిలువ సజీవంగా మింగేసినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. సాయంత్రం ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా తోటలో ఆమె దుస్తులు లభించాయి. మరుసటి రోజు భారీ పొట్టతో ఉన్న కొండచిలువను గుర్తించి గ్రామస్థులు చంపి చూడగా ఆమె శవం బయటపడింది. ఈ భయానక ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.