సామాజిక మాధ్యమాలు చూసి చోరీలు పన్నెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విజయనగరం

సామాజిక మాధ్యమాలను చూసి నేరాలు చేయడం నేర్చుకున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను బాడంగి పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు బొబ్బిలి డీఎస్పీ గోవిందరావు, సీఐ మల్లికార్జునరావు వివరాలు వెల్లడించారు. సాలూరు, విశాఖ, విజయనగరం ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుల నుంచి పన్నెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముగ్గురు నిందితులను రిమాండ్కు తరలించగా, బాలుడిని జువైనల్ హోంకు అప్పగించినట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.