కరెంటు కోతలతో ప్రజలను కాంగ్రెస్ సర్కార్ మోసగిస్తోందన్న జీవన్ రెడ్డి

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో కరెంటు కోతలు ప్రారంభమయ్యాయని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. గతంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తే, నేడు ఆరు గంటలు కూడా సరిగా ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.