అమృతరాణి కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలిచిన మంత్రులు
రిపోర్టర్: SK
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంటలో ఇంజనీరింగ్ విద్యార్థిని అమృతరాణి కుటుంబాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ విజయరమణారావు, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, కలెక్టర్ కోయ శ్రీహర్ష పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.4.12 లక్షల పరిహారంతో పాటు ఇందిరమ్మ ఇల్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.