చిన్నరాజుపోడు గ్రామంలో ఓట్ల వేటలో దూకుడు పెంచిన స్వప్న

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ఓబులవారిపల్లి

ఓబులవారిపల్లి మండలం చిన్నరాజుపోడు గ్రామంలో వైఎస్ఆర్సీపీ బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి బండారు స్వప్న ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నాయకులు సుంకేసుల రఫీ ఆధ్వర్యంలో ఆదివారం ఈ ప్రచారం సాగింది. స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ఓట్లు అభ్యర్థించారు.