గురుకుల ఉద్యోగి అంజయ్య సేవలను కొనియాడిన ప్రముఖులు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి విరమణ పొందిన ఐరేని అంజయ్యను ఘనంగా సత్కరించారు. ప్రిన్సిపల్ సుధాకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, రాజకీయ నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అంజయ్య ఆదర్శవంతమైన సేవలను బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సట్టు తిరుమలేష్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆప్తులు, బంధువులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.