విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఘనంగా నివాళులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విజయనగరం
విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆర్డీవో సీహెచ్ సత్తిబాబు తదితరులు ఘనంగా నివాళులర్పించారు. విశ్వకర్మ మహర్షిని సృష్టికర్తగా, శిల్పకళా నిపుణుడిగా, వాస్తుశాస్త్ర పితామహుడిగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలిగాపు విజయలక్ష్మీ, శ్రీనివాసరావు, రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.