నందికొట్కూరులో వైసీపీ సంచలన విజయం: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యూహం సక్సెస్

రిపోర్టర్: రాజేష్ స్థలం: నంద్యాల

నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ ఎన్నికల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారని రాజకీయ వర్గాలు వెల్లడించాయి. మొత్తం ముప్ఫై రెండు వార్డులకుగాను ఇరవై మూడుకుపైగా స్థానాలను కైవసం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి హవా కొనసాగుతున్నప్పటికీ, ఇక్కడ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యూహం కారణంగానే పార్టీ విజయదుందభి మోగిందని నాయకులు స్పష్టం చేశారు. ఈ భారీ విజయంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి.