నర్సాపూర్ శివారులో పేకాట స్థావరంపై విరుచుకుపడ్డ పోలీసులు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలంలోని నర్సాపూర్ గ్రామ శివారులో ఖాళీ స్థలంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేసి ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి పదిహేను వేల రెండు వందల పది రూపాయల నగదుతో పాటు పేక ముక్కలు, మోటార్ సైకిళ్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.