కాకినాడ జిల్లాలో కోటీ ఇరవై మూడు లక్షల విలువైన మొబైల్స్ రికవరీ
రిపోర్టర్: మహేష్
స్థలం: కాకినాడ
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ప్రత్యేక చొరవతో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న మరియు చోరీకి గురైన రూ.1.23 కోట్ల విలువైన 618 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేసినట్లు కాకినాడ పోలీస్ వెల్లడించారు. ఇప్పటివరకు 13 విడతల్లో మొత్తం 5,221 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు ఆయన తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాధితులకు వేగంగా సేవలు అందిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రికవరీ చేసిన ఫోన్లను అందుకున్న బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.