పుణెలో ఆకట్టుకుంటున్న 21 వేల పానీపూరీలతో తయారు చేసిన వినాయక విగ్రహం
రిపోర్టర్: నరేష్
స్థలం: పుణె
మహారాష్ట్రలోని పుణెలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రూపేశ్, దినేశ్ గుడ్మేవార్ అనే ఇద్దరు సోదరులు 21 వేల పానీపూరీలను ఉపయోగించి 13 అడుగుల ఎత్తైన వినూత్న వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఫెర్గూసన్ కాలేజ్ రోడ్డులో కొలువుదీరిన ఈ పానీపూరీ గణపతిని చూసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తుండగా, విగ్రహం పాడవకుండా కళాకారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.