వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్: ప్రభుత్వ కళాశాలల్లో కొత్తగా 161 పీజీ సీట్లు
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా 161 పీజీ సీట్లను జాతీయ వైద్యమండలి మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వివిధ వైద్య విభాగాల్లో ఈ సీట్లను భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అత్యధికంగా ఆర్థోపెడిక్స్ విభాగంలో 27 సీట్లు లభించాయని తెలిపారు. ఈ నిర్ణయంతో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మరింత మెరుగైన అవకాశాలు లభిస్తాయని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి.