హైదరాబాద్లో భారీ వర్షం బీభత్సం: డ్రైనేజీ కాల్వలో పడిన డెలివరీ ఎగ్జిక్యూటివ్ సురక్షితం
రిపోర్టర్: రమేష్
స్థలం: Hyderabad
హైదరాబాద్లో శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయం కాగా, ఘంటసాల అర్జున్ కుమార్ అనే జెప్టో డెలివరీ ఎగ్జిక్యూటివ్ ప్రమాదవశాత్తు వరద నీటితో నిండిన డ్రైనేజీ కాల్వలో పడిపోయారు. స్థానికుల సమాచారంతో వెంటనే స్పందించిన పోలీసులు మరియు రెస్క్యూ సిబ్బంది తీవ్ర ఉత్కంఠ మధ్య ఆయన్ను సురక్షితంగా బయటకు వెలికితీశారు. ఈ ఘటనలో ఆయన ప్రాణాలతో బయటపడ్డారని, అయితే మోటార్ సైకిల్ మాత్రం కాల్వలోనే ఉండిపోయిందని అధికారులు తెలిపారు.