వైద్యశాఖ ఫైళ్లపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సీరియస్ ఆదేశాలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అమరావతి
వైద్య, ఆరోగ్య శాఖలో ఫైళ్ల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 12 నుంచి పెండింగ్లో ఉన్న ఫైళ్ల వివరాలను ఈ నెల 10లోపు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల వినతులను నిర్ణీత గడువులోగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఫైళ్ల నిర్వహణను వెంటనే గాడిన పెట్టాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి.