వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్న శ్రీనివాస్యాదవ్

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్లో వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడిన ఐలమ్మ బడుగు, బలహీన వర్గాలకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని బీసీవై పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు చిలకల శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. బహుజనులు ఐక్యంగా ఉంటూ విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో హక్కులను సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.