భారత క్రికెట్ హోమ్ సిరీస్ టైటిల్ స్పాన్సర్‌గా ముత్తూట్ గ్రూప్

రిపోర్టర్: నరేష్ స్థలం: న్యూఢిల్లీ

భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో స్వదేశంలో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లు మరియు దేశవాళీ టోర్నమెంట్ల టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను ముత్తూట్ ఫిన్‌కార్ప్ దక్కించుకుంది. మార్చి 2028 వరకు ఈ ఒప్పందం కొనసాగనుండగా, వెస్టిండీస్ సిరీస్ నుంచి ఇది అమల్లోకి రానుంది. ఈ ప్రతిష్టాత్మక వాణిజ్య భాగస్వామ్యం ద్వారా రాబోయే రెండేళ్లలో దాదాపు 35 అంతర్జాతీయ మ్యాచ్‌లకు ముత్తూట్ గ్రూప్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనున్నట్లు బోర్డు వెల్లడించింది.