జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం: రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు అంగీకారం

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

వైకాపా అధినేత జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసుల్లోనూ రోజువారీ విచారణ చేపట్టాలని సీబీఐ కోర్టు నిర్ణయించిందని అధికారులు తెలిపారు. సీబీఐ కేసులతో పాటు ఈడీ కేసులను కూడా ఏకకాలంలో విచారించాలని అటు ఈడీ, ఇటు నిందితుల తరఫు న్యాయవాదులు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి ఈడీ కేసులను కూడా విచారణ జాబితాలో ఉంచనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.