దారకొండ ఆసుపత్రిలో అంబులెన్స్ మరమ్మతులు చేపట్టాలని స్థానికుల విజ్ఞప్తి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జీ.కే.వీధి
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దారకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంబులెన్స్ మరమ్మతులకు గురికావడంతో గిరిజన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో క్షతగాత్రులను, గర్భిణులను మైదాన ప్రాంత ఆసుపత్రులకు తరలించేందుకు వాహన సదుపాయం లేక నానా అవస్థలు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల కోసం ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అంబులెన్స్‌కు మరమ్మతులు చేయించాలని లేదా ప్రత్యామ్నాయ వాహనాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.