అర్నబ్ తుపాను బీభత్సం: ఏపీలో దంచికొడుతున్న వర్షాలు, ఆరుగురు దుర్మరణం

రిపోర్టర్: గోపి స్థలం: విశాఖపట్నం

అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతాలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం మరియు విశాఖపట్నం జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. గరివిడిలో అత్యధికంగా ఇరవై ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల బీభత్సం కారణంగా వేర్వేరు ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.