రాజకీయ విలువలపై వైవిఎస్ విజయసాయిరెడ్డి వైఖరిని ప్రశ్నించిన ఏపీ కాంగ్రెస్

రిపోర్టర్: వెంకట్ స్థలం: Andhra Pradesh

అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మరియు అధికారం దూరమైనప్పుడు మరో మాట మాట్లాడటం మీ విశ్వసనీయతను సూచిస్తుందా అని వైవీఎస్ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ఏపీ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ప్రశ్నించింది. రాజకీయ అవసరాలకు అనుగుణంగా వైఖరులు మార్చుకోవడం సరైంది కాదని పేర్కొంటూ ఏపీ కాంగ్రెస్ అధికారిక ఖాతాలో విమర్శలు గుప్పించింది. రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడే ముందు మీ రాజకీయ ప్రయాణాన్ని ఒక్కసారి పరిశీలించుకోవాలని హితవు పలుకుతూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చింది.