మేడిపల్లి జ్యువెలరీ షాప్ చోరీ కేసు గుట్టురట్టు: నిందితుల అరెస్ట్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Medipally

మేడిపల్లి క్యారట్ లైన్ జువెలరీ షాప్ లో జరిగిన భారీ చోరీ కేసు మిస్టరీ వీడిందని, బీహార్ కు చెందిన చద్దర్ గ్యాంగ్ ఈ దొంగతనానికి పాల్పడినట్లు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి ఖాతాల్ లోని పదిమూడు లక్షల రూపాయలను ఫ్రీజ్ చేసినట్లు శనివారం ఆమె మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.