ఆదివాసీల హక్కులకై దేశ రాజధానిలో గళమెత్తిన రాజబాబు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: జి.కె.వీధి
దేశవ్యాప్తంగా ఆదివాసీల సమస్యలు ఒకేలా ఉన్నాయని, వాటిపై అందరూ ఉమ్మడిగా పోరాడాలని భారత్ ఆదివాసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు పిలుపునిచ్చారు. రత్లాంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో ఆదివాసీల గళం వినిపిస్తోందని, తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.