విజయనగరం మహిళా హాస్టళ్లలో వేధిస్తున్న తీవ్ర సిబ్బంది కొరత

రిపోర్టర్: గోపి స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాలేజ్ ఎట్ హోమ్, వర్కింగ్ విమెన్స్ హాస్టళ్లలో సిబ్బంది కొరత తీవ్ర సమస్యగా మారిందని ఐసీడీఎస్ పీడీ కేవీ బాలామణి వెల్లడించారు. కాపలాదారులు, వంట మనుషులు లేకపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజ్ ఎట్ హోమ్లో అంధురాలైన హెల్పరే కుక్గా పనిచేస్తుండటంతో సమయానికి టిఫిన్ అందక విద్యార్థినులు బయట తింటున్నారని తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి త్వరలోనే తగిన ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు.