తప్పుడు ప్రచారాలపై బీఆర్ఎస్ నేతలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్ర హెచ్చరికలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Hyderabad
అక్రమ ఆస్తులపై బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ వెల్లడించింది. మీ ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారని, తాము ఎప్పుడూ అలా చేయలేదని స్పష్టం చేసింది. కేటీఆర్ మీ ఇంటి ఆడబిడ్డను బయటకు పంపిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రత్యర్థుల తీరును పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు.