తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించిందని ఏఐసీసీ వెల్లడించింది. మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ స్థానం నుంచి సామ రామ్మోహన్ రెడ్డిని, నల్గొండ - ఖమ్మం - వరంగల్ స్థానం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని బరిలోకి దించుతున్నట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో అభ్య్రర్థులను ఖరారు చేసినట్లు పార్టీ నేతలు తెలిపారు.