హిట్లర్ గతే మోడీకి పడుతుంది: ప్రధానిపై కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ దీప్కే ఫైర్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: బెంగళూరు
వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది వన్ నేషన్ వన్ పార్టీ కోసమేనని కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే మండిపడ్డారు. బెంగళూరు ఫ్రీడమ్ పార్క్‌లో సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా కోర్టులో ఆయన మాట్లాడారు. జర్మన్ నియంత హిట్లర్‌కు పట్టిన గతే ప్రధాని నరేంద్ర మోడీకి పడుతుందని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరుగుతున్నాయని, దీనిని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.