ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విశిష్ట సేవలు
రిపోర్టర్: santhoshkumar
స్థలం: గాజువాక
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రెండవ ఉపకులపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ 1931 నుంచి 1936 వరకు విశిష్ట సేవలు అందించారు. తత్వశాస్త్ర విభాగాన్ని ప్రారంభించడంతో పాటు, ఆయన స్వయంగా ఇక్కడ బోధన చేసి విశ్వవిద్యాలయ కీర్తిని దశదిశలా చాటారు.
ఏయూ నుంచి తొలి గౌరవ డాక్టరేట్ పొందిన వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఆయన జ్ఞాపకార్థం ఆర్ట్స్ కళాశాలకు సర్వేపల్లి పేరును నామకరణం చేయడంతో పాటు, అక్కడే ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఘనంగా స్మరించుకుంటున్నారు.