చార్లెస్ బార్క్లీని అరెస్ట్ చేయాలంటూ ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్‌గా మారిన షాకిల్ ఓనీల్ సరదా వ్యాఖ్యలు
రిపోర్టర్: అశోక్
స్థలం: వర్జీనియా
ఎన్బీఏ దిగ్గజం షాకిల్ ఓనీల్ తాజాగా గౌరవ ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్ హోదాను అందుకున్నారు. వర్జీనియాలోని క్వాంటికోలో జరిగిన ఎఫ్‌బీఐ నేషనల్ అకాడమీ స్నాతకోత్సవంలో ఆయన ఈ గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా తన ప్రసంగం ముగింపులో తన సహచరుడు, ప్రముఖ మాజీ బాస్కెట్ బాల్ ఆటగాడు చార్లెస్ బార్క్లీని ఉద్దేశించి మాట్లాడుతూ, ఎక్కడైనా బార్క్లీ కనిపిస్తే వెంటనే అరెస్ట్ చేయాలని సరదాగా వ్యాఖ్యానించడం సభికులను నవ్విస్తూ వైరల్ అయింది.