సమాజ్ వాదీ పార్టీ ఎంపీ లక్ష్మీకాంత్ నిషాద్ పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Uttar Pradesh

ఉత్తరప్రదేశ్ లోని సంతోబ్ నగర్ జిల్లా బఖీరా పోలీసు స్టేషన్ పరిధిలో గణేష్ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా జరిగిన ఘర్షణలో సమాజ్ వాదీ పార్టీ ఎంపీ లక్ష్మీకాంత్ అలియాస్ పప్పు నిషాద్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. డిజె ఆపడంపై జరిగిన వివాదంలో ఎంపీ కారుపై దాడి జరగగా, ఎంపీ కారు ఢీకొట్టి తనను గాయపరిచారంటూ విశాల్ కుమార్ అనే స్థానికుడు ఇచ్చిన కౌంటర్ ఫిర్యాదు మేరకు పోలీసులు పరస్పర కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.