ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే తగ్గించాలని బొబ్బిలిలో సిపిఐ నాయకుల డిమాండ్

రిపోర్టర్: Bobbili GANESH స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో బలిజిపేట రోడ్డు జండా మహల్ జంక్షన్ వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న, మునకాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పేద, మధ్యతరగతి కుటుంబాల బతుకులు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధాన వైఫల్యం వల్లే దళారీ వ్యవస్థ పెరిగి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని మండిపడ్డారు. తక్షణమే ధరలు తగ్గించి ప్రజలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జి.సత్యనారాయణ, కే.సంజీవ్, ఎం.అప్పలనాయుడు, వి.శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.