పోలీసులకు తీపి కబురు: ఫిట్ కాప్ యాప్ రూపకల్పనకు డీజీపీ శ్రీకారం
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తొంబై వేలకు పైగా పోలీసు సిబ్బంది ఆరోగ్యం మరియు సంక్షేమాన్ని కాపాడేందుకు ప్రత్యేకంగా ఫిట్ కాప్ సమగ్ర ఆరోగ్య నిర్వహణ యాప్ను తీసుకురానున్నట్లు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. సిబ్బంది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ డిజిటల్ అప్లికేషన్ ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే ముప్ పై నుంచి నలభై ఐదు రోజుల్లోపే ఈ యాప్ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని ఆయన స్పష్టం చేశారు.