వైజాగ్ నేపథ్యంలో వస్తున్న 'చకోర' టీజర్ విడుదల చేసిన మంత్రి
రిపోర్టర్: రాజేష్
స్థలం: విశాఖపట్నం
వైజాగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'చకోర - లూనార్ లవ్ బర్డ్' చిత్రం టీజర్‌ను కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు ఆవిష్కరించారు. శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు మంగా శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 8న విడుదల కానున్న ఈ ప్రేమకథా చిత్రంలో సుమన్, ఇంద్రజ, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హై జాయ్ కమర్షియల్స్ బ్యానర్‌పై చింతాడ హేమారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.