ఎన్నికల సిబ్బందికి చేదు అనుభవం: నందిగామలో భోజనం అందక ఆందోళన

రిపోర్టర్: రమేష్ స్థలం: Nandigama

ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందికి తొలిరోజే చేదు అనుభవం ఎదురైందని, సరైన భోజన సదుపాయాలు కల్పించకపోవడంతో ఆందోళనకు దిగామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మున్సిపల్ కమిషనర్ భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పినా పట్టించుకోలేదని, ప్లేట్లు పట్టుకొని గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చిందని, కనీస వసతులు లేకుండా విధులు ఎలా నిర్వర్తించాలని సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.