ఈవీఎంలపై కాంగ్రెస్ విమర్శలను ఖండించిన కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

ప్రజా తీర్పును గౌరవించకుండా కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను నిందించడం సరికాదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పుడల్లా ప్రజాస్వామ్య వ్యవస్థలను, ఈవీఎంలను రాహుల్ గాంధీ తప్పుబడుతున్నారని ఆయన పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా ప్రతికూల రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తున్నారని, ఎక్కడైనా ఫలితం మాత్రం కాంగ్రెస్ పార్టీకి శూన్యమే మిగులుతుందని స్పష్టం చేస్తూ ఆయన సామాజిక మాధ్య వేదికగా విమర్శలు గుప్పించారు.