విజయనగరంలో తెదేపా కార్యాలయం ఎదుట ఎంపీటీసీ అభ్యర్థి రాజేష్ నిరసన

రిపోర్టర్: అశోక్ స్థలం: విజయనగరం

పోటీ నుంచి తప్పుకోవాలని తెదేపా నాయకులు వేధింపులకు గురిచేస్తున్నారని భాజపా నేత పతివాడ రాజేష్ ఆరోపించారు. విజయనగరం జిల్లా తెదేపా కార్యాలయం ఎదుట సోమవారం ఆయన నిరసన చేపట్టారు. తనకు సీటు కేటాయించి బీఫారం ఇచ్చినా కొందరు కావాలనే ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వెంటనే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వివాదంపై ఇరుపార్టీల అధ్యక్షులు సమావేశమయ్యారు.