నిరుద్యోగులకు తీపి కబురు: ఏపీలో రెండు వేలకు పైగా డీఎస్సీ పోస్టుల భర్తీ

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించిందని రాష్ట్ర అధికారులు తెలిపారు. వివిధ కేటగిరీల్లో మొత్తం రెండు వేల ఏడవందల ఇరవై ఒకటి టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. నవంబర్ మూడో తేదీలోపు పూర్తి స్థాయి నోటిఫికేషన్ వెలువడుతుందని, అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.