వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Kadapa
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో A-1 ఎర్ర గంగిరెడ్డి, A-3 ఉమాశంకర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27, 28 తేదీల్లో విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. రూ.40 కోట్ల సుపారీ డీల్, మనీలాండరింగ్ కోణంలో ఇప్పటికే సునీల్ యాదవ్, దస్తగిరిలను విచారించిన అధికారులు, తాజాగా వీరిద్దరిని ప్రశ్నించనున్నారు.