నాలుగు దశాబ్దాల తర్వాత పర్యాటకుల కోసం ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఓపెన్

రిపోర్టర్: నరేష్ స్థలం: ఛత్తీస్‌గఢ్

ఛత్తీస్గఢ్ లోని బస్తర్ ప్రాంతంలో ప్రసిద్ధ ఇంద్రావతి టైగర్ రిజర్వ్ను నాలుగు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత పర్యాటకుల కోసం ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించినట్లు అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఓపీ యాదవ్ వెల్లడించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ అటవీ ప్రాంతంలోకి పర్యాటకులకు ప్రవేశం కల్పించామని, పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.