కొమ్మిలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు.. ఉట్టి కొట్టిన యువత!
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కొండాపురం
నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. యాదవ్ సోదరుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి నవీన్ పాల్గొని, గ్రామస్తులతో కలిసి ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు.
ఈ సందర్భంగా కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున వేడుకల నిర్వహణకు నవీన్ ఆర్థిక సాయం అందజేశారు. ప్రతి ఏటా ఈ పండుగను ఇలాగే ఐక్యతతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ ప్రతినిధులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.