నెల్లిమర్ల పంచాయతీ ఎన్నికలు: కూటమి అభ్యర్థి విజయానికి నేతల ముమ్మర ప్రచారం

రిపోర్టర్: మహేష్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ ఛైర్మన్ స్థానానికి పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి మైపాడ ప్రసాద్ విజయం కోరుతూ భాజపా రాష్ట్ర ఇన్ఛార్జ్ అరవింద్ సింగ్ బడోరియా, ఎమ్మెల్యే లోకం నాగమాధవి, తెదేపా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆదివారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నామని, అభివృద్ధిని నిరంతరం కొనసాగించాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలం గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని వారు ఓటర్లను కోరారు.