రాజ్ ఠాక్రేపై రీల్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌కు శిక్ష

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధిపతి రాజ్ ఠాక్రేపై సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు విసిరిన మహేష్ మోటే అనే ఇన్ఫ్లుయెన్సర్‌కు పూణేలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు దేహశుద్ధి చేశారు. కాట్రాజ్ ప్రాంతంలో అతన్ని పట్టుకున్న కార్యకర్తలు, ముఖానికి నల్లమసి పూసి, చెప్పులు తలపై పెట్టుకుని గుంజీలు తీయించారు. అంతేకాక, రాజ్ ఠాక్రే చిత్రపటం ముందు సాష్టాంగ నమస్కారం చేయించి క్షమాపణ చెప్పాలని బలవంతం చేసి, ఆ వీడియోను విడుదల చేశారు.