బాలారంలో ఘనంగా BCY పార్టీ జెండా ఆవిష్కరణ
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: కొయ్యూరు
కొయ్యూరు మండలం బాలారం గ్రామంలో భారతీయ చైతన్య యువజన పార్టీ జెండాను జిల్లా అధ్యక్షులు కిల్లో రాజన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి వంటి సమస్యల పరిష్కారానికి పార్టీ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన పలువురు గ్రామస్థులకు కిల్లో రాజన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యువత ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.