విశాఖపట్నం: ప్రజలతో మమేకమై శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పల్లె నిద్ర నిర్వహణ

రిపోర్టర్: విజయ్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం నగరంలో ప్రజలతో మమేకమై క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడం లక్ష్యంగా పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు. కమిషనర్ మరియు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు పోలీస్ శాఖ పేర్కొంది. ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ వారికి భరోసా కల్పించడం జరుగుతోందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.