సిద్దాపూర్ డంపింగ్ యార్డు జీవో రద్దు: ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కొందుర్గ్
సిద్దాపూర్లో ఎకో టౌన్ పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 641ను రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డు వ్యతిరేక జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలకు ఆయన మద్దతు పలికారు. డంపింగ్ యార్డు ఏర్పాటు వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని, పర్యావరణంతో పాటు భూగర్భ జలాలు కలుషితమవుతాయని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.